Cross Reference
2 Timothy 1:13
క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము;
1 Timothy 6:12
విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.
1 Timothy 1:18
నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
2 Timothy 3:10
అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును,
Titus 1:5
నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియ మించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.
Malachi 2:7
యాజకులు సైన్య ములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను.
Luke 12:42
ప్రభువు ఇట్లనెనుతగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
1 Timothy 1:12
పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,
1 Timothy 4:6
ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల,నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు.
1 Corinthians 4:2
మరియు గృహనిర్వా హకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.
Colossians 1:7
ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.
1 Timothy 4:14
పెద్దలు హస్తనిక్షేపణముచేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము.
1 Timothy 5:22
త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.
2 Timothy 2:24
సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును;
2 Timothy 3:14
క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక,
Revelation 2:10
ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.
1 Timothy 3:2
అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యా దస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునై యుండి,
1 Samuel 2:35
తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.
Ezra 7:10
ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.
Ezra 7:25
మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధి కారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ఆ ధర్మశాస్త్రవిషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను.
Psalm 101:6
నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు లగుదురు.
Proverbs 13:17
దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.
Jeremiah 23:28
కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.
Matthew 13:52
ఆయనఅందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థ ములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నా డని వారితో చెప్పెను.
Luke 16:10
మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయ ముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
Numbers 12:7
అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.
Hebrews 3:2
దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.
Hebrews 2:17
కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్య ములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.
Matthew 24:25
ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.
Nehemiah 7:2
నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు.