Proverbs 7 - BBE (Telugu)
1 My son, keep my sayings, and let my rules be stored up with you.నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.
2 Keep my rules and you will have life; let my teaching be to you as the light of your eyes;నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
3 Let them be fixed to your fingers, and recorded in your heart.నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము
4 Say to wisdom, You are my sister; let knowledge be named your special friend:జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
5 So that they may keep you from the strange woman, even from her whose words are smooth.అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.
6 Looking out from my house, and watching through the window,నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను
7 I saw among the young men one without sense,¸°వనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.
8 Walking in the street near the turn of her road, going on the way to her house,సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ
9 At nightfall, in the evening of the day, in the black dark of the night.వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.
10 And the woman came out to him, in the dress of a loose woman, with a designing heart;అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.
11 She is full of noise and uncontrolled; her feet keep not in her house.అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.
12 Now she is in the street, now in the open spaces, waiting at every turning of the road.ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.
13 So she took him by his hand, kissing him, and without a sign of shame she said to him:అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను
14 I have a feast of peace-offerings, for today my oaths have been effected.సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను
15 So I came out in the hope of meeting you, looking for you with care, and now I have you.కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి
16 My bed is covered with cushions of needlework, with coloured cloths of the cotton thread of Egypt;నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
17 I have made my bed sweet with perfumes and spices.నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
18 Come, let us take our pleasure in love till the morning, having joy in love's delights.ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
19 For the master of the house is away on a long journey:పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
20 He has taken a bag of money with him; he is coming back at the full moon.అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
21 With her fair words she overcame him, forcing him with her smooth lips.అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
22 The simple man goes after her, like an ox going to its death, like a roe pulled by a cord;వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
23 Like a bird falling into a net; with no thought that his life is in danger, till an arrow goes into his side.తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
24 So now, my sons, give ear to me; give attention to the sayings of my mouth;నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
25 Let not your heart be turned to her ways, do not go wandering in her footsteps.జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
26 For those wounded and made low by her are great in number; and all those who have come to their death through her are a great army.అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
27 Her house is the way to the underworld, going down to the rooms of death.దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
Telugu Bible