Mark 15 - BBE (Telugu)
1 And the first thing in the morning the chief priests, with those in authority and the scribes and all the Sanhedrin, had a meeting, and put cords round Jesus, and took him away, and gave him up to Pilate.ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్ద లును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.
2 And Pilate put a question to him, Are you the King of the Jews? And he, answering, said to him, You say so.పిలాతుయూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయననీవన్నట్టే అని అతనితో చెప్పెను.
3 And the chief priests said a number of things against him.ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా
4 And Pilate again put a question, Do you say nothing in answer? see how much evil they say you have done.పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
5 But Jesus gave no more answers, so that Pilate was full of wonder.అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను.
6 Now at the feast every year he let one prisoner go free at their request.ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.
7 And there was one named Barabbas, in prison with those who had gone against the government and in the fight had taken life.అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
8 And the people went up, requesting him to do as he had done for them in other years.జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా
9 And Pilate said in answer to them, Is it your desire that I let the King of the Jews go free?ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని
10 For he saw that the chief priests had given him up through envy.పిలాతు తెలిసికొనినేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను.
11 But the people were moved by the chief priests to make him let Barabbas go free.అతడు బరబ్బను తమకు విడుదల చేయ వలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.
12 And Pilate again said in answer to them, What then am I to do to him to whom you give the name of the King of the Jews?అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను.
13 And they said again loudly, To the cross with him!వారువానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి.
14 And Pilate said to them, Why, what evil has he done? But their cry was the louder, To the cross!అందుకు పిలాతుఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారువానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
15 And Pilate, desiring to do what was pleasing to the people, let Barabbas go free, and gave up Jesus, when he had been whipped, to be put to death on the cross.పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
16 And the men of the army took him away into the square in front of the building which is the Praetorium, and they got together all the band.అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమ కూర్చుకొనినతరువాత
17 And they put a purple robe on him, and twisting a crown of thorns, they put it on him;ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి,
18 And, as if honouring him, they said, Long life to the King of the Jews!యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.
19 And they gave him blows on the head with a stick and put shame on him and, going down on their knees, gave him worship.మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమి్మవేసి, మోకాళ్లూని ఆయనకు నమ స్కారముచేసిరి.
20 And when they had made sport of him, they took the purple robe off him and put his clothing on him. And they took him out to put him to death on the cross.వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయు టకు తీసికొనిపోయిరి.
21 And they made one, Simon of Cyrene, the father of Alexander and Rufus, who was going by, coming from the country, go with them, so that he might take his cross.కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయు టకు అతనిని బలవంతముచేసిరి.
22 And they took him to the place named Golgotha, which is, Dead Man's Head.అతడు అలెక్సంద్రు నకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము.
23 And they gave him wine mixed with myrrh; but he did not take it.అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు.
24 And he was nailed to the cross; and they made a division of his clothing among them, putting to the decision of chance what everyone was to take.వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచు కొనిరి.
25 And it was the third hour when they put him on the cross.ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమి్మది గంటలాయెను.
26 And the statement of his crime was put in writing on the cross, THE KING OF THE JEWS.మరియుయూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి.
27 And they put two thieves on crosses with him, one on his right side, and one on his left.మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని
28 []ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువవేసిరి.
29 And those who went by made sport of him, shaking their heads, and saying, Ha! you who give the Temple to destruction, and put it up again in three days,అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,
30 Keep yourself from death, and come down from the cross.సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించు కొనుమని చెప్పి ఆయనను దూషించిరి.
31 In the same way the chief priests, laughing at him among themselves with the scribes, said, A saviour of others, he has no salvation for himself.అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచువీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.
32 Let the Christ, the King of Israel, come down now from the cross, so that we may see and have belief. And those who were put on crosses with him said evil things against him.ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి.
33 And when the sixth hour had come, it was dark over all the land till the ninth hour.మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
34 And at the ninth hour, Jesus said in a loud voice, Eloi, Eloi, lama sabachthani? which is, My God, my God, why are you turned away from me?మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
35 And some of those who were near, hearing it, said, See, he is crying to Elijah.దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి.
36 And one of them went quickly and, getting a sponge full of bitter wine, put it on a rod, and gave it to him for drink, saying, Let be; let us see if Elijah will come to take him down.ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చు నేమో చూతమనెను.
37 And Jesus gave a loud cry, and gave up his spirit.అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.
38 And the curtain of the Temple was parted in two from end to end.అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.
39 And when the captain, who was near, saw how he gave up his spirit, he said, Truly this man was a son of God.ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
40 And there were women watching from a distance: among them were Mary Magdalene, and Mary, the mother of James the less and of Joses, and Salome,వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.
41 Who went with him when he was in Galilee and took care of him; and a number of other women who came up with him to Jerusalem.ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూష లేమునకు వచ్చిన ఇతర స్త్రీల నేకులును వారిలో ఉండిరి.
42 And when it was evening, because it was the time of getting ready, that is, the day before the Sabbath,ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము
43 There came Joseph of Arimathaea, a responsible man in high honour, who was himself waiting for the kingdom of God; and he went in to Pilate without fear, and made a request for the body of Jesus.గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.
44 And Pilate was surprised that he was dead; and, sending for the captain, he put a question to see if he had been dead for long.పిలాతుఆయన ఇంతలోనే చని పోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతినితన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.
45 And when he had news of it from the captain, he let Joseph have the body.శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.
46 And he got a linen cloth and, taking him down, put the linen cloth round him, and put him in a place for the dead which had been cut out of a rock; and a stone was rolled against the door.అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.
47 And Mary Magdalene and Mary, the mother of Joses, saw where he was put.మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
Telugu Bible