Proverbs 31 - YLT (Telugu)

1 Words of Lemuel a king, a declaration that his mother taught him:రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి,

2 `What, my son? and what, son of my womb? And what, son of my vows?నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమా రుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును?

3 Give not to women thy strength, And thy ways to wiping away of kings.నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయ కుము

4 Not for kings, O Lemuel, Not for kings, to drink wine, And for princes a desire of strong drink.ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు.

5 Lest he drink, and forget the decree, And change the judgment of any of the sons of affliction.త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు

6 Give strong drink to the perishing, And wine to the bitter in soul,ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి.

7 He drinketh, and forgetteth his poverty, And his misery he remembereth not again.వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు.

8 Open thy mouth for the dumb, For the right of all sons of change.మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము.

9 Open thy mouth, judge righteously, Both the cause of the poor and needy!'నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము.

10 A woman of worth who doth find? Yea, far above rubies `is' her price.గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.

11 The heart of her husband hath trusted in her, And spoil he lacketh not.ఆమె పెనిమిటి ఆమెయందు నమి్మకయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.

12 She hath done him good, and not evil, All days of her life.ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.

13 She hath sought wool and flax, And with delight she worketh `with' her hands.ఆమె గొఱ్ఱబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును.

14 She hath been as ships of the merchant, From afar she bringeth in her bread.వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.

15 Yea, she riseth while yet night, And giveth food to her household, And a portion to her damsels.ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.

16 She hath considered a field, and taketh it, From the fruit of her hands she hath planted a vineyard.ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.

17 She hath girded with might her loins, And doth strengthen her arms.ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును

18 She hath perceived when her merchandise `is' good, Her lamp is not extinguished in the night.తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.

19 Her hands she hath sent forth on a spindle, And her hands have held a distaff.ఆమె పంటెను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును.

20 Her hand she hath spread forth to the poor, Yea, her hands she sent forth to the needy.దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును

21 She is not afraid of her household from snow, For all her household are clothed `with' scarlet.తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు.

22 Ornamental coverings she hath made for herself, Silk and purple `are' her clothing.ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.

23 Known in the gates is her husband, In his sitting with elders of the land.ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుం డును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.

24 Linen garments she hath made, and selleth, And a girdle she hath given to the merchant.ఆమె నారబట్టలు నేయించి అమ్మునునడికట్లను వర్తకులకు అమ్మును.

25 Strength and honour `are' her clothing, And she rejoiceth at a latter day.బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును.

26 Her mouth she hath opened in wisdom, And the law of kindness `is' on her tongue.జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.

27 She `is' watching the ways of her household, And bread of sloth she eateth not.ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.

28 Her sons have risen up, and pronounce her happy, Her husband, and he praiseth her,ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి

29 `Many `are' the daughters who have done worthily, Thou hast gone up above them all.'యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.

30 The grace `is' false, and the beauty `is' vain, A woman fearing Jehovah, she may boast herself.అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును

31 Give ye to her of the fruit of her hands, And her works do praise her in the gates!చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.

Telugu Bible