Proverbs 29 - YLT (Telugu)
1 A man often reproved, hardening the neck, Is suddenly broken, and there is no healing.ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
2 In the multiplying of the righteous the people rejoice, And in the ruling of the wicked the people sigh.నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
3 A man loving wisdom rejoiceth his father, And a friend of harlots destroyeth wealth.జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష పరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును.
4 A king by judgment establisheth a land, And one receiving gifts throweth it down.న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును.
5 A man taking a portion above his neighbour, Spreadeth a net for his own steps.తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.
6 In the transgression of the evil `is' a snare, And the righteous doth sing and rejoice.దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును.
7 The righteous knoweth the plea of the poor, The wicked understandeth not knowledge.నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు.
8 Men of scorning ensnare a city, And the wise turn back anger.అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు.
9 A wise man is judged by the foolish man, And he hath been angry, And he hath laughed, and there is no rest.జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
10 Men of blood hate the perfect, And the upright seek his soul.నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
11 A fool bringeth out all his mind, And the wise till afterwards restraineth it.బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూప కుండును.
12 A ruler who is attending to lying words, All his ministers `are' wicked.అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు
13 The poor and the man of frauds have met together, Jehovah is enlightening the eyes of them both.బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.
14 a king that is judging truly the poor, His throne for ever is established.ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
15 A rod and reproof give wisdom, And a youth let away is shaming his mother.బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
16 In the multiplying of the wicked transgression multiplieth, And the righteous on their fall do look.దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచె దరు.
17 Chastise thy son, and he giveth thee comfort, Yea, he giveth delights to thy soul.నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును
18 Without a Vision is a people made naked, And whoso is keeping the law, O his happiness!దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.
19 By words a servant is not instructed though he understand, And there is nothing answering.దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు
20 Thou hast seen a man hasty in his words! More hope of a fool than of him.ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.
21 Whoso is bringing up his servant delicately, from youth, `At' his latter end also he is continuator.ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమా రుడుగా ఎంచబడును.
22 An angry man stirreth up contention, And a furious man is multiplying transgression.కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.
23 The pride of man humbleth him, And humility of spirit upholdeth honour.ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును
24 Whoso is sharing with a thief is hating his own soul, Execration he heareth, and telleth not.దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.
25 Fear of man causeth a snare, And the confident in Jehovah is set on high.భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమి్మక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
26 Many are seeking the face of a ruler, And from Jehovah `is' the judgment of each.అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
27 An abomination to the righteous `is' the perverse man, And an abomination to the wicked `is' the upright in the way!దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.
Telugu Bible