Proverbs 29 - ASV (Telugu)
1 He that being often reproved hardeneth his neck Shall suddenly be destroyed, and that without remedy.ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
2 When the righteous are increased, the people rejoice; But when a wicked man beareth rule, the people sigh.నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
3 Whoso loveth wisdom rejoiceth his father; But he that keepeth company with harlots wasteth `his' substance.జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష పరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును.
4 The king by justice establisheth the land; But he that exacteth gifts overthroweth it.న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును.
5 A man that flattereth his neighbor Spreadeth a net for his steps.తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.
6 In the transgression of an evil man there is a snare; But the righteous doth sing and rejoice.దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును.
7 The righteous taketh knowledge of the cause of the poor; The wicked hath not understanding to know `it'.నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు.
8 Scoffers set a city in a flame; But wise men turn away wrath.అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు.
9 If a wise man hath a controversy with a foolish man, Whether he be angry or laugh, there will be no rest.జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
10 The bloodthirsty hate him that is perfect; And as for the upright, they seek his life.నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
11 A fool uttereth all his anger; But a wise man keepeth it back and stilleth it.బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూప కుండును.
12 If a ruler hearkeneth to falsehood, All his servants are wicked.అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు
13 The poor man and the oppressor meet together; Jehovah lighteneth the eyes of them both.బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.
14 The king that faithfully judgeth the poor, His throne shall be established for ever.ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
15 The rod and reproof give wisdom; But a child left to himself causeth shame to his mother.బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
16 When the wicked are increased, transgression increaseth; But the righteous shall look upon their fall.దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచె దరు.
17 Correct thy son, and he will give thee rest; Yea, he will give delight unto thy soul.నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును
18 Where there is no vision, the people cast off restraint; But he that keepeth the law, happy is he.దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.
19 A servant will not be corrected by words; For though he understand, he will not give heed.దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు
20 Seest thou a man that is hasty in his words? There is more hope of a fool than of him.ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.
21 He that delicately bringeth up his servant from a child Shall have him become a son at the last.ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమా రుడుగా ఎంచబడును.
22 An angry man stirreth up strife, And a wrathful man aboundeth in transgression.కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.
23 A man's pride shall bring him low; But he that is of a lowly spirit shall obtain honor.ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును
24 Whoso is partner with a thief hateth his own soul; He heareth the adjuration and uttereth nothing.దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.
25 The fear of man bringeth a snare; But whoso putteth his trust in Jehovah shall be safe.భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమి్మక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
26 Many seek the ruler's favor; But a man's judgment `cometh' from Jehovah.అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
27 An unjust man is an abomination to the righteous; And he that is upright in the way is an abomination to the wicked.దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.
Telugu Bible