Proverbs 28 - YLT (Telugu)

1 The wicked have fled and there is no pursuer. And the righteous as a young lion is confident.ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.

2 By the transgression of a land many `are' its heads. And by an intelligent man, Who knoweth right -- it is prolonged.దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకు లగుదురు బుద్ధిజ్ఞానములు గలవారిచేత దాని అధికారము స్థిర పరచబడును.

3 A man -- poor and oppressing the weak, `Is' a sweeping rain, and there is no bread.బీదలను బాధించు దరిద్రుడు ఆహారవస్తువులను ఉండనియ్యక కొట్టుకొనిపోవు వానతో సమానుడు.

4 Those forsaking the law praise the wicked, Those keeping the law plead against them.ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడు దురు.

5 Evil men understand not judgment, And those seeking Jehovah understand all.దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిం చుదురు.

6 Better `is' the poor walking in his integrity, Than the perverse of ways who is rich.వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.

7 Whoso is keeping the law is an intelligent son, And a friend of gluttons, Doth cause his father to blush.ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.

8 Whoso is multiplying his wealth by biting and usury, For one favouring the poor doth gather it.వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.

9 Whoso is turning his ear from hearing the law, Even his prayer `is' an abomination.ధర్మశాస్త్రమువినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.

10 Whoso is causing the upright to err in an evil way, Into his own pit he doth fall, And the perfect do inherit good.యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొం దురు.

11 A rich man is wise in his own eyes, And the intelligent poor searcheth him.ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును.

12 In the exulting of the righteous the glory `is' abundant, And in the rising of the wicked man is apprehensive.నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కార ణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుం దురు.

13 Whoso is covering his transgressions prospereth not, And he who is confessing and forsaking hath mercy.అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

14 O the happiness of a man fearing continually, And whoso is hardening his heart falleth into evil.నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.

15 A growling lion, and a ranging bear, `Is' the wicked ruler over a poor people.బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.

16 A leader lacking understanding multiplieth oppressions, Whoso is hating dishonest gain prolongeth days.వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.

17 A man oppressed with the blood of a soul, Unto the pit fleeth, none taketh hold on him.ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు.

18 Whoso is walking uprightly is saved, And the perverted of ways falleth at once.యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.

19 Whoso is tilling his ground is satisfied `with' bread, And whoso is pursuing vanity, Is filled `with' poverty.తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండ న్నము దొరకును వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు.

20 A stedfast man hath multiplied blessings, And whoso is hasting to be rich is not acquitted.నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు.

21 To discern faces is not good, And for a piece of bread doth a man transgress.పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.

22 Troubled for wealth `is' the man `with' an evil eye, And he knoweth not that want doth meet him.చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.

23 Whoso is reproving a man afterwards findeth grace, More than a flatterer with the tongue.నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొం దును.

24 Whoso is robbing his father, or his mother, And is saying, `It is not transgression,' A companion he is to a destroyer.తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహముకాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు.

25 Whoso is proud in soul stirreth up contention, And whoso is trusting on Jehovah is made fat.పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.

26 Whoso is trusting in his heart is a fool, And whoso is walking in wisdom is delivered.తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.

27 Whoso is giving to the poor hath no lack, And whoso is hiding his eyes multiplied curses.బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలు గును.

28 In the rising of the wicked a man is hidden, And in their destruction the righteous multiply!దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.

Telugu Bible