Proverbs 26 - WEB (Telugu)

1 Like snow in summer, and as rain in harvest, So honor is not fitting for a fool.ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.

2 Like a fluttering sparrow, Like a darting swallow, So the undeserved curse doesn't come to rest.రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.

3 A whip for the horse, A bridle for the donkey, And a rod for the back of fools!గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.

4 Don't answer a fool according to his folly, Lest you also be like him.వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.

5 Answer a fool according to his folly, Lest he be wise in his own eyes.వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.

6 One who sends a message by the hand of a fool Is cutting off feet and drinking violence.మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమా నుడు.

7 Like the legs of the lame that hang loose: So is a parable in the mouth of fools.కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును

8 As one who binds a stone in a sling, So is he who gives honor to a fool.బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు.

9 Like a thornbush that goes into the hand of a drunkard, So is a parable in the mouth of fools.మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్న ట్లుండును.

10 As an archer who wounds all, So is he who hires a fool Or he who hires those who pass by.అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును.

11 As a dog that returns to his vomit, So is a fool who repeats his folly.తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.

12 Do you see a man wise in his own eyes? There is more hope for a fool than for him.తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.

13 The sluggard says, "There is a lion in the road! A fierce lion roams the streets!"సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును.

14 As the door turns on its hinges, So does the sluggard on his bed.ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.

15 The sluggard buries his hand in the dish. He is too lazy to bring it back to his mouth.సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.

16 The sluggard is wiser in his own eyes Than seven men who answer with discretion.హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును

17 Like one who grabs a dog's ears Is one who passes by and meddles in a quarrel not his own.తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.

18 Like a madman who shoots firebrands, arrows, and death,తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు

19 Is the man who deceives his neighbor and says, "Am I not joking?"తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.

20 For lack of wood a fire goes out; Without gossip, a quarrel dies down.కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.

21 As coals are to hot embers, And wood to fire, So is a contentious man to kindling strife.వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.

22 The words of a whisperer are as dainty morsels, They go down into the innermost parts.కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.

23 Like silver dross on an earthen vessel Are the lips of a fervent one with an evil heart.చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.

24 A malicious man disguises himself with his lips, But he harbors evil in his heart.పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.

25 When his speech is charming, don't believe him; For there are seven abominations in his heart:వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మ కుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.

26 His malice may be concealed by deception, But his wickedness will be exposed in the assembly.వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.

27 Whoever digs a pit shall fall into it. Whoever rolls a stone, it will come back on him.గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.

28 A lying tongue hates those it hurts; And a flattering mouth works ruin.అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషిం చును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.

Telugu Bible