Proverbs 24 - BBE (Telugu)
1 Have no envy for evil men, or any desire to be with them:దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము
2 For the purposes of their hearts are destruction, and their lips are talking of trouble.వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.
3 The building of a house is by wisdom, and by reason it is made strong:జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.
4 And by knowledge its rooms are full of all dear and pleasing things.తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.
5 A wise man is strong; and a man of knowledge makes strength greater.జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.
6 For by wise guiding you will overcome in war: and in a number of wise guides there is salvation.వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము
7 Wisdom is outside the power of the foolish: he keeps his mouth shut in the public place.మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై యుందురు.
8 He whose purposes are bad will be named a man of evil designs.కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.
9 The purpose of the foolish is sin: and the hater of authority is disgusting to others.మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.
10 If you give way in the day of trouble, your strength is small.శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.
11 Be the saviour of those who are given up to death, and do not keep back help from those who are slipping to destruction.చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?
12 If you say, See, we had no knowledge of this: does not the tester of hearts give thought to it? and he who keeps your soul, has he no knowledge of it? and will he not give to every man the reward of his work?ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహిం చును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
13 My son, take honey, for it is good; and the flowing honey, which is sweet to your taste:నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.
14 So let your desire be for wisdom: if you have it, there will be a future, and your hope will not be cut off.నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.
15 Do not keep a secret watch, O evil-doer, against the fields of the upright man, or send destruction on his resting-place:భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.
16 For an upright man, after falling seven times, will get up again: but trouble is the downfall of the evil.నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.
17 Do not be glad at the fall of your hater, and let not your heart have joy at his downfall:నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.
18 For fear that the Lord may see it, and it may be evil in his eyes, and his wrath may be turned away from him.యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.
19 Do not be troubled because of evil-doers, or have envy of sinners:దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.
20 For there will be no future for the evil man; the light of sinners will be put out.దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరి పోవును
21 My son, go in fear of the Lord and the king: have nothing to do with those who are in high positions:నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము.
22 For their downfall will come suddenly; and who has knowledge of the destruction of those in high positions?అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును?
23 These are more sayings of the wise: To have respect for a person's position when judging is not good.ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు
24 He who says to the evil-doer, You are upright, will be cursed by peoples and hated by nations.నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు.
25 But those who say sharp words to him will have delight, and a blessing of good will come on them.న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.
26 He gives a kiss with his lips who gives a right answer.సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.
27 Put your work in order outside, and make it ready in the field; and after that, see to the building of your house.బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.
28 Do not be a violent witness against your neighbour, or let your lips say what is false.నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుక కుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?
29 Say not, I will do to him as he has done to me; I will give the man the reward of his work.వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను కొనకుము.
30 I went by the field of the hater of work, and by the vine-garden of the man without sense;సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా
31 And it was all full of thorns, and covered with waste plants, and its stone wall was broken down.ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను.దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను.
32 Then looking at it, I gave thought: I saw, and I got teaching from it.నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.
33 A little sleep, a little rest, a little folding of the hands in sleep:ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట
34 So loss will come on you like an outlaw, and your need like an armed man.వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.
Telugu Bible