Proverbs 2 - YLT (Telugu)
1 My son, if thou dost accept my sayings, And my commands dost lay up with thee,నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల
2 To cause thine ear to attend to wisdom, Thou inclinest thy heart to understanding,జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల
3 For, if for intelligence thou callest, For understanding givest forth thy voice,తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల
4 If thou dost seek her as silver, And as hid treasures searchest for her,వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల
5 Then understandest thou fear of Jehovah, And knowledge of God thou findest.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
6 For Jehovah giveth wisdom, From His mouth knowledge and understanding.యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.
7 Even to lay up for the upright substance, A shield for those walking uprightly.ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.
8 To keep the paths of judgment, And the way of His saints He preserveth.న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.
9 Then understandest thou righteousness, And judgment, and uprightness -- every good path.అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.
10 For wisdom cometh into thy heart, And knowledge to thy soul is pleasant,జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును
11 Thoughtfulness doth watch over thee, Understanding doth keep thee,బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.
12 To deliver thee from an evil way, From any speaking froward things,అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.
13 Who are forsaking paths of uprightness, To walk in ways of darkness,అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు
14 Who are rejoicing to do evil, They delight in frowardness of the wicked,కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.
15 Whose paths `are' crooked, Yea, they are perverted in their ways.వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు
16 To deliver thee from the strange woman, From the stranger who hath made smooth her sayings,మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.
17 Who is forsaking the guide of her youth, And the covenant of her God hath forgotten.అట్టి స్త్రీ తన ¸°వనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది.
18 For her house hath inclined unto death, And unto Rephaim her paths.దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును
19 None going in unto her turn back, Nor do they reach the paths of life.దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల
20 That thou dost go in the way of the good, And the paths of the righteous dost keep.నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు.
21 For the upright do inhabit the earth, And the perfect are left in it,యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు.
22 And the wicked from the earth are cut off, And treacherous dealers plucked out of it!భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.
Telugu Bible