Proverbs 2 - DBY (Telugu)

1 My son, if thou receivest my words, and layest up my commandments with thee,నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల

2 so that thou incline thine ear unto wisdom [and] thou apply thy heart to understanding;జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల

3 yea, if thou criest after discernment [and] liftest up thy voice to understanding;తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల

4 if thou seekest her as silver and searchest for her as for hidden treasures:వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల

5 then shalt thou understand the fear of Jehovah, and find the knowledge of God.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.

6 For Jehovah giveth wisdom; out of his mouth [come] knowledge and understanding.యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

7 He layeth up sound wisdom for the upright; [he] is a shield to them that walk in integrity;ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.

8 guarding the paths of just judgment and keeping the way of his godly ones.న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.

9 Then shalt thou understand righteousness and judgment and equity: every good path.అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.

10 When wisdom entereth into thy heart and knowledge is pleasant unto thy soul,జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును

11 discretion shall keep thee, understanding shall preserve thee:బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.

12 To deliver thee from the way of evil, from the man that speaketh froward things;అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.

13 [from those] who leave the paths of uprightness, to walk in the ways of darkness;అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు

14 who rejoice to do evil, [and] delight in the frowardness of evil;కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.

15 whose paths are crooked, and who are perverted in their course:వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు

16 To deliver thee from the strange woman, from the stranger who flattereth with her words;మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.

17 who forsaketh the guide of her youth, and forgetteth the covenant of her God;అట్టి స్త్రీ తన ¸°వనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది.

18 -- for her house inclineth unto death, and her paths unto the dead;దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును

19 none that go unto her return again, neither do they attain to the paths of life:దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల

20 -- that thou mayest walk in the way of the good, and keep the paths of the righteous.నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు.

21 For the upright shall dwell in the land, and the perfect shall remain in it;యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు.

22 but the wicked shall be cut off from the land, and the unfaithful shall be plucked up out of it.భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.

Telugu Bible