Proverbs 2 - ASV (Telugu)

1 My son, if thou wilt receive my words, And lay up my commandments with thee;నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల

2 So as to incline thine ear unto wisdom, And apply thy heart to understanding;జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల

3 Yea, if thou cry after discernment, And lift up thy voice for understanding;తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల

4 If thou seek her as silver, And search for her as for hid treasures:వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల

5 Then shalt thou understand the fear of Jehovah, And find the knowledge of God.యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.

6 For Jehovah giveth wisdom; Out of his mouth `cometh' knowledge and understanding:యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

7 He layeth up sound wisdom for the upright; `He is' a shield to them that walk in integrity;ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.

8 That he may guard the paths of justice, And preserve the way of his saints.న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.

9 Then shalt thou understand righteousness and justice, And equity, `yea', every good path.అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.

10 For wisdom shall enter into thy heart, And knowledge shall be pleasant unto thy soul;జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును

11 Discretion shall watch over thee; Understanding shall keep thee:బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.

12 To deliver thee from the way of evil, From the men that speak perverse things;అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.

13 Who forsake the paths of uprightness, To walk in the ways of darkness;అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు

14 Who rejoice to do evil, And delight in the perverseness of evil;కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.

15 Who are crooked in their ways, And wayward in their paths:వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు

16 To deliver thee from the strange woman, Even from the foreigner that flattereth with her words;మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.

17 That forsaketh the friend of her youth, And forgetteth the covenant of her God:అట్టి స్త్రీ తన ¸°వనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది.

18 For her house inclineth unto death, And her paths unto the dead;దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును

19 None that go unto her return again, Neither do they attain unto the paths of life:దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల

20 That thou mayest walk in the way of good men, And keep the paths of the righteous.నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు.

21 For the upright shall dwell in the land, And the perfect shall remain in it.యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు.

22 But the wicked shall be cut off from the land, And the treacherous shall be rooted out of it.భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.

Telugu Bible