Proverbs 18 - WEB (Telugu)
1 An unfriendly man pursues selfishness, And defies all sound judgment.వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
2 A fool has no delight in understanding, But only in revealing his own opinion.తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.
3 When wickedness comes, contempt also comes, And with shame comes disgrace.భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును.
4 The words of a man's mouth are like deep waters. The fountain of wisdom is like a flowing brook.మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.
5 To be partial to the faces of the wicked is not good, Nor to deprive the innocent of justice.తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు.
6 A fool's lips come into strife, And his mouth invites beatings.బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.
7 A fool's mouth is his destruction, And his lips are a snare to his soul.బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.
8 The words of a gossip are like dainty morsels: They go down into a person's innermost parts.కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.
9 One who is slack in his work Is brother to him who is a master of destruction.పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు.
10 The name of Yahweh is a strong tower: The righteous run to him, and are safe.యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
11 The rich man's wealth is his strong city, Like an unscalable wall in his own imagination.ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.
12 Before destruction the heart of man is proud, But before honor is humility.ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.
13 He who gives answer before he hears, That is folly and shame to him.సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
14 A man's spirit will sustain him in sickness, But a crushed spirit, who can bear?నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?
15 The heart of the discerning gets knowledge. The ear of the wise seeks knowledge.జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.
16 A man's gift makes room for him, And brings him before great men.ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును
17 He who pleads his cause first seems right; Until another comes and questions him.వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.
18 The lot settles disputes, And keeps strong ones apart.చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును.
19 A brother offended is more difficult than a fortified city; And disputes are like the bars of a castle.బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశ పరచు కొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిర ములు.
20 A man's stomach is filled with the fruit of his mouth. With the harvest of his lips he is satisfied.ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తిపొందును.
21 Death and life are in the power of the tongue; Those who love it will eat its fruit.జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు
22 Whoever finds a wife finds a good thing, And obtains favor of Yahweh.భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.
23 The poor plead for mercy, But the rich answer harshly.దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.
24 A man of many companions may be ruined, But there is a friend who sticks closer than a brother.బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు.
Telugu Bible