Proverbs 16 - WEB (Telugu)

1 The plans of the heart belong to man, But the answer of the tongue is from Yahweh.హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.

2 All the ways of a man are clean in his own eyes; But Yahweh weighs the motives.ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.

3 Commit your deeds to Yahweh, And your plans shall succeed.నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.

4 Yahweh has made everything for its own end-- Yes, even the wicked for the day of evil.యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.

5 Everyone who is proud in heart is an abomination to Yahweh: They shall assuredly not be unpunished.గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.

6 By mercy and truth iniquity is atoned for. By the fear of Yahweh men depart from evil.కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.

7 When a man's ways please Yahweh, He makes even his enemies to be at peace with him.ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

8 Better is a little with righteousness, Than great revenues with injustice.అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.

9 A man's heart plans his course, But Yahweh directs his steps.ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును

10 Inspired judgments are on the lips of the king. He shall not betray his mouth.దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు.

11 Honest balances and scales are Yahweh's; All the weights in the bag are his work.న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.

12 It is an abomination for kings to do wrong, For the throne is established by righteousness.రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.

13 Righteous lips are the delight of kings. They value one who speaks the truth.నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.

14 The king's wrath is a messenger of death, But a wise man will pacify it.రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.

15 In the light of the king's face is life. His favor is like a cloud of the spring rain.రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.

16 How much better it is to get wisdom than gold! Yes, to get understanding is to be chosen rather than silver.అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.

17 The highway of the upright is to depart from evil. He who keeps his way preserves his soul.చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.

18 Pride goes before destruction, And a haughty spirit before a fall.నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

19 It is better to be of a lowly spirit with the poor, Than to divide the plunder with the proud.గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.

20 He who heeds the Word finds prosperity. Whoever trusts in Yahweh is blessed.ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.

21 The wise in heart shall be called prudent. Pleasantness of the lips promotes instruction.జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.

22 Understanding is a fountain of life to one who has it, But the punishment of fools is their folly.తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష

23 The heart of the wise instructs his mouth, And adds learning to his lips.జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.

24 Pleasant words are a honeycomb, Sweet to the soul, and health to the bones.ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.

25 There is a way which seems right to a man, But in the end it leads to death.ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.

26 The appetite of the laboring man labors for him; For his mouth urges him on.కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును.

27 A worthless man devises mischief. His speech is like a scorching fire.పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.

28 A perverse man stirs up strife. A whisperer separates close friends.మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.

29 A man of violence entices his neighbor, And leads him in a way that is not good.బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును.

30 One who winks his eyes to plot perversities, One who compresses his lips, is bent on evil.కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు.

31 Gray hair is a crown of glory. It is attained by a life of righteousness.నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.

32 One who is slow to anger is better than the mighty; One who rules his spirit, than he who takes a city.పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు

33 The lot is cast into the lap, But its every decision is from Yahweh.చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.

Telugu Bible