John 9 - WEB (Telugu)
1 As he passed by, he saw a man blind from birth.ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.
2 His disciples asked him, "Rabbi, who sinned, this man or his parents, that he was born blind?"ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా
3 Jesus answered, "Neither did this man sin, nor his parents; but, that the works of God might be revealed in him.యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.
4 I must work the works of him who sent me, while it is day. The night is coming, when no one can work.పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు.
5 While I am in the world, I am the light of the world."నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.
6 When he had said this, he spat on the ground, made mud with the saliva, anointed the blind man's eyes with the mud,ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమి్మవేసి, ఉమి్మతో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి
7 and said to him, "Go, wash in the pool of Siloam" (which means "Sent"). So he went away, washed, and came back seeing.నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.
8 The neighbors therefore, and those who saw that he was blind before, said, "Isn't this he who sat and begged?"కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారునువీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి.
9 Others were saying, "It is he." Still others were saying, "He looks like him." He said, "I am he."వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతేనేనే యనెను.
10 They therefore were asking him, "How were your eyes opened?"వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా
11 He answered, "A man called Jesus made mud, anointed my eyes, and said to me, 'Go to the pool of Siloam, and wash.' So I went away and washed, and I received sight."వాడుయేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.
12 Then they asked him, "Where is he?" He said, "I don't know."వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.
13 They brought him who had been blind to the Pharisees.అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి.
14 It was a Sabbath when Jesus made the mud and opened his eyes.యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము
15 Again therefore the Pharisees also asked him how he received his sight. He said to them, "He put mud on my eyes, I washed, and I see."వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను.
16 Some therefore of the Pharisees said, "This man is not from God, because he doesn't keep the Sabbath." Others said, "How can a man who is a sinner do such signs?" There was division among them.కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
17 Therefore they asked the blind man again, "What do you say about him, because he opened your eyes?" He said, "He is a prophet."కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను.
18 The Jews therefore did not believe concerning him, that he had been blind, and had received his sight, until they called the parents of him who had received his sight,వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి,
19 and asked them, "Is this your son, who you say was born blind? How then does he now see?"గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి.
20 His parents answered them, "We know that this is our son, and that he was born blind;అందుకు వాని తలిదండ్రులువీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.
21 but how he now sees, we don't know; or who opened his eyes, we don't know. He is of age. Ask him. He will speak for himself."ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.
22 His parents said these things because they feared the Jews; for the Jews had already agreed that if any man would confess him as Christ, he would be put out of the synagogue.వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి.
23 Therefore his parents said, "He is of age. Ask him."కావున వాని తలిదండ్రులువాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి.
24 So they called the man who was blind a second time, and said to him, "Give glory to God. We know that this man is a sinner."కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా
25 He therefore answered, "I don't know if he is a sinner. One thing I do know: that though I was blind, now I see."వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగు దును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నా ననెను.
26 They said to him again, "What did he do to you? How did he open your eyes?"అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా
27 He answered them, "I told you already, and you didn't listen. Why do you want to hear it again? You don't also want to become his disciples, do you?"వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.
28 They insulted him and said, "You are his disciple, but we are disciples of Moses.అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము;
29 We know that God has spoken to Moses. But as for this man, we don't know where he comes from."దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.
30 The man answered them, "How amazing! You don't know where he comes from, yet he opened my eyes.అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను.
31 We know that God doesn't listen to sinners, but if anyone is a worshipper of God, and does his will, he listens to him.దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.
32 Since the world began it has never been heard of that anyone opened the eyes of someone born blind.పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు.
33 If this man were not from God, he could do nothing."ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.
34 They answered him, "You were altogether born in sins, and do you teach us?" They threw him out.అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.
35 Jesus heard that they had thrown him out, and finding him, he said, "Do you believe in the Son of God?"పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను.
36 He answered, "Who is he, Lord, that I may believe in him?"అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా
37 Jesus said to him, "You have both seen him, and it is he who speaks with you."యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.
38 He said, "Lord, I believe!" and he worshiped him.అంతట వాడుప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.
39 Jesus said, "I came into this world for judgment, that those who don't see may see; and that those who see may become blind."అప్పుడు యేసుచూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.
40 Those of the Pharisees who were with him heard these things, and said to him, "Are we also blind?"ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట వినిమేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.
41 Jesus said to them, "If you were blind, you would have no sin; but now you say, 'We see.' Therefore your sin remains.అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.
Telugu Bible