John 7 - BBE (Telugu)

1 After this, Jesus went from place to place in Galilee. He did not go about in Judaea, because the Jews were looking for a chance to put him to death.అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.

2 But the feast of the Jews, the feast of tents, was near.యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక

3 So his brothers said to him, Go away from here into Judaea so that your disciples may see the works which you do.ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.

4 Because no man does things secretly if he has a desire that men may have knowledge of him. If you do these things, let yourself be seen by all men.బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కన బరచుకొనుమని చెప్పిరి.

5 For even his brothers had no belief in him.ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.

6 Jesus said to them, My time is still to come, but any time is good for you.యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.

7 It is not possible for you to be hated by the world; but I am hated by it, because I give witness that what it does is evil.లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.

8 Go you up to the feast: I am not going up now to the feast because my time has not fully come.మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణముకాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.

9 Having said these things to them, he still kept in Galilee.ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.

10 But after his brothers had gone up to the feast, then he went up, not publicly, but in secret.అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.

11 At the feast the Jews were looking for him and saying, Where is he?పండుగలో యూదులుఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.

12 And there was much discussion about him among the mass of the people. Some said, He is a good man; but others said, No, he is giving people false ideas.మరియు జనసమూహము లలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరుకాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;

13 But no man said anything about him openly for fear of the Jews.అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.

14 Now in the middle of the feast Jesus went up to the Temple and was teaching.సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.

15 Then the Jews were surprised and said, How has this man got knowledge of books? He has never been to school.యూదులు అందుకు ఆశ్చర్య పడిచదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.

16 Jesus gave them this answer: It is not my teaching, but his who sent me.అందుకు యేసునేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.

17 If any man is ready to do God's pleasure he will have knowledge of the teaching and of where it comes from--from God or from myself.ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును.

18 The man whose words come from himself is looking for glory for himself, but he who is looking for the glory of him who sent him--that man is true and there is no evil in him.తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహి మను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.

19 Did not Moses give you the law? Even so, not one of you keeps the law. Why have you a desire to put me to death?మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.

20 The people said in answer, You have an evil spirit: who has any desire to put you to death?అందుకు జనసమూహమునీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా

21 This was the answer of Jesus: I have done one work and you are all surprised at it.యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు.

22 Moses gave you circumcision--not that it comes from Moses, but from the fathers--and even on the Sabbath you give a child circumcision.మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు.

23 If a child is given circumcision on the Sabbath so that the law of Moses may not be broken, why are you angry with me because I made a man completely well on the Sabbath?మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?

24 Let not your decisions be based on what you see, but on righteousness.వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.

25 Then some of the people of Jerusalem said, Is not this the man whose death is desired?యెరూషలేమువారిలో కొందరువారు చంప వెదకు వాడు ఈయనే కాడా?

26 And here he is talking openly and they say nothing to him! Is it possible that the rulers have knowledge that this is truly the Christ?ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?

27 However, it is clear to us where this man comes from: but when the Christ comes no one will have knowledge where he comes from.అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.

28 Then, when he was teaching in the Temple, Jesus said with a loud voice, You have knowledge of me and you have knowledge of where I come from; and I have not come of myself; but there is One who has sent me; he is true, but you have no knowledge of him.కాగా యేసు దేవాలయములో బోధించుచుమీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.

29 I have knowledge of him because I came from him and he sent me.నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.

30 Then they had a desire to take him: but no man put hands on him because his hour was still to come.అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు.

31 And numbers of the people had belief in him, and they said, When the Christ comes will he do more signs than this man has done?మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.

32 This discussion of the people came to the ears of the Pharisees; and the chief priests and the Pharisees sent servants to take him.జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.

33 Then Jesus said, I will be with you a little longer and then I go to him who sent me.యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;

34 You will be looking for me, and you will not see me: and where I am you may not come.మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.

35 So the Jews said among themselves, To what place is he going where we will not see him? will he go to the Jews living among the Greeks and become the teacher of the Greeks?అందుకు యూదులుమనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా?

36 What is this saying of his, You will be looking for me and will not see me, and where I am you may not come?నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.

37 On the last day, the great day of the feast, Jesus got up and said in a loud voice, If any man is in need of drink let him come to me and I will give it to him.ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

38 He who has faith in me, out of his body, as the Writings have said, will come rivers of living water.నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

39 This he said of the Spirit which would be given to those who had faith in him: the Spirit had not been given then, because the glory of Jesus was still to come.తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

40 When these words came to their ears, some of the people said, This is certainly the prophet.జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;

41 Others said, This is the Christ. But others said, Not so; will the Christ come from Galilee?మరికొందరుఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?

42 Do not the Writings say that the Christ comes of the seed of David and from Beth-lehem, the little town where David was?క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.

43 So there was a division among the people because of him.కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.

44 And some of them had a desire to take him; but no man put hands on him.వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.

45 Then the servants went back to the chief priests and Pharisees, who said to them, Why have you not got him with you?ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యులయొద్దకును వచ్చినప్పుడువారుఎందుకు మీ రాయ నను తీసికొని రాలేదని అడుగగా

46 The servants made answer, No man ever said things like this man.ఆ బంట్రౌతులుఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి.

47 Then the Pharisees said to them, Have you, like the others, been given false ideas?అందుకు పరిసయ్యులుమీరుకూడ మోస పోతిరా?

48 Have any of the rulers belief in him, or any one of the Pharisees?అధి కారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?

49 But these people who have no knowledge of the law are cursed.అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.

50 Nicodemus--he who had come to Jesus before, being himself one of them--said to them,అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.

51 Is a man judged by our law before it has given him a hearing and has knowledge of what he has done?అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా

52 This was their answer: And do you come from Galilee? Make search and you will see that no prophet comes out of Galilee.వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.

53 [And every man went to his house;అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.

Telugu Bible