2 Samuel 13 - WEB (Telugu)
1 It happened after this, that Absalom the son of David had a beautiful sister, whose name was Tamar; and Amnon the son of David loved her.తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.
2 Amnon was so vexed that he fell sick because of his sister Tamar; for she was a virgin; and it seemed hard to Amnon to do anything to her.తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను.
3 But Amnon had a friend, whose name was Jonadab, the son of Shimeah, David's brother; and Jonadab was a very subtle man.అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు
4 He said to him, Why, son of the king, are you thus lean from day to day? Won't you tell me? Amnon said to him, I love Tamar, my brother Absalom's sister.రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.
5 Jonadab said to him, Lay you down on your bed, and feign yourself sick: and when your father comes to see you, tell him, Please let my sister Tamar come and give me bread to eat, and dress the food in my sight, that I may see it, and eat it from her hand.యెహోనాదాబునీవు రోగివైనట్టువేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవునా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.
6 So Amnon lay down, and feigned himself sick: and when the king was come to see him, Amnon said to the king, Please let her sister Tamar come, and make me a couple of cakes in my sight, that I may eat from her hand.అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా
7 Then David sent home to Tamar, saying, Go now to your brother Amnon's house, and dress him food.దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.
8 So Tamar went to her brother Amnon's house; and he was laid down. She took dough, and kneaded it, and made cakes in his sight, and did bake the cakes.కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.
9 She took the pan, and poured them out before him; but he refused to eat. Amnon said, Have out all men from me. They went out every man from him.అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడునాకు వద్దని చెప్పిఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండ నెను.
10 Amnon said to Tamar, Bring the food into the chamber, that I may eat from your hand. Tamar took the cakes which she had made, and brought them into the chamber to Amnon her brother.వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోనునీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.
11 When she had brought them near to him to eat, he took hold of her, and said to her, Come, lie with me, my sister.అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొనినా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా
12 She answered him, No, my brother, do not force me; for no such thing ought to be done in Israel. Don't you do this folly.ఆమెనా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును?
13 I, where shall I carry my shame? and as for you, you will be as one of the fools in Israel. Now therefore, please speak to the king; for he will not withhold me from you.నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగు దువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము;
14 However he would not listen to her voice; but being stronger than she, he forced her, and lay with her.అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.
15 Then Amnon hated her with exceeding great hatred; for the hatred with which he hated her was greater than the love with which he had loved her. Amnon said to her, Arise, be gone.అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమెయెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటె అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా
16 She said to him, Not so, because this great wrong in putting me forth is [worse] than the other that you did to me. But he would not listen to her.ఆమెనన్ను బయటకు తోసివేయుటవలన నాకు నీవిప్పుడు చేసిన కీడుకంటె మరి యెక్కువకీడు చేయకుమని చెప్పినను
17 Then he called his servant who ministered to him, and said, Put now this woman out from me, and bolt the door after her.అతడు ఆమె మాట వినక తన పని వారిలో ఒకని పిలిచిదీనిని నాయొద్దనుండి వెళ్లగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను.
18 She had a garment of various colors on her; for with such robes were the king's daughters who were virgins dressed. Then his servant brought her out, and bolted the door after her.కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించి యుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను.
19 Tamar put ashes on her head, and tore her garment of various colors that was on her; and she laid her hand on her head, and went her way, crying aloud as she went.అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా
20 Absalom her brother said to her, Has Amnon your brother been with you? but now hold your peace, my sister: he is your brother; don't take this thing to heart. So Tamar remained desolate in her brother Absalom's house.ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచినీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊర కుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట నుండెను.
21 But when king David heard of all these things, he was very angry.ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను.
22 Absalom spoke to Amnon neither good nor bad; for Absalom hated Amnon, because he had forced his sister Tamar.అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసి నందుకై అతనిమీద పగయుంచెను.
23 It happened after two full years, that Absalom had sheep-shearers in Baal Hazor, which is beside Ephraim: and Absalom invited all the king's sons.రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.
24 Absalom came to the king, and said, See now, your servant has sheep-shearers; let the king, I pray you, and his servants go with your servant.అబ్షాలోము రాజునొద్దకు వచ్చిచిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱ బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా
25 The king said to Absalom, No, my son, let us not all go, lest we be burdensome to you. He pressed him: however he would not go, but blessed him.రాజునా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను.
26 Then said Absalom, If not, please let my brother Amnon go with us. The king said to him, Why should he go with you?అయితే దావీదు వెళ్ల నొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోమునీవు రాకపోయిన యెడల నా అన్నయగు అమ్నోను మాతోకూడ వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీయొద్దకు ఎందుకు రావలెనని రాజు అడుగగా
27 But Absalom pressed him, and he let Amnon and all the king's sons go with him.అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతని యొద్దకు పోవచ్చు నని సెలవిచ్చెను.
28 Absalom commanded his servants, saying, Mark you now, when Amnon's heart is merry with wine; and when I tell you, Smite Amnon, then kill him; don't be afraid; haven't I commanded you? be courageous, and be valiant.అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పు నప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను.
29 The servants of Absalom did to Amnon as Absalom had commanded. Then all the king's sons arose, and every man got him up on his mule, and fled.అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.
30 It happened, while they were in the way, that the news came to David, saying, Absalom has slain all the king's sons, and there is not one of them left.వారు మార్గములో ఉండగానే యొకడును లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా
31 Then the king arose, and tore his garments, and lay on the earth; and all his servants stood by with their clothes torn.అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను; మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడియుండిరి.
32 Jonadab, the son of Shimeah, David's brother, answered, Don't let my lord suppose that they have killed all the young men the king's sons; for Amnon only is dead; for by the appointment of Absalom this has been determined from the day that he forced his sister Tamar.దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచిరాజకుమారులైన ¸°వ నులనందరిని వారు చంపిరని నా యేలినవాడవగు నీవు తలంచవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెను; ఏల యనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిననాటనుండి అబ్షా లోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటనుబట్టి నిశ్చ యించుకొనవచ్చును.
33 Now therefore don't let my lord the king take the thing to his heart, to think that all the king's sons are dead; for Amnon only is dead.కాబట్టి నా యేలినవాడవగు నీవు రాజకుమారులందరును మరణమైరని తలచి విచారపడవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెననెను.
34 But Absalom fled. The young man who kept the watch lifted up his eyes, and looked, and, behold, there came much people by the way of the hill-side behind him.అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి యుండెను. కావలియున్న పని వాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి.
35 Jonadab said to the king, Behold, the king's sons are come: as your servant said, so it is.యెహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు; నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారము గానే ఆయెనని రాజుతో చెప్పెను.
36 It happened, as soon as he had made an end of speaking, that behold, the king's sons came, and lifted up their voice, and wept: and the king also and all his servants wept very sore.అతడు ఆమాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వ సాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.
37 But Absalom fled, and went to Talmai the son of Ammihur, king of Geshur. [David] mourned for his son every day.అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారునికొరకు అంగలార్చుచుండెను.
38 So Absalom fled, and went to Geshur, and was there three years.అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత
39 [the soul of] king David longed to go forth to Absalom: for he was comforted concerning Amnon, seeing he was dead.రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.
Telugu Bible